వేసవిలో పేదలకు అందుబాటులోకి వచ్చిన కారు చౌక ఫ్రిజ్లు
– కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : వేసవి ఎండలలో శీతల పానీయాలు, చల్లటి మంచి నీటితో దప్పిక తీర్చుకునేం దుకు ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. ధనవంతులు ఇతర వర్గాల వారు ఫ్రిజ్లలలో మంచినీటిని బాటిళ్లలో పెట్టుకొని చల్లటి నీటిని సేవిస్తుంటారు. పేద మధ్యతరగతి కార్మికులు ఇతర వర్గాల వారు చల్లటి నీటి కోసం పూర్వకాలం నుండి కుమ్మరులు తయారు చేసే కుండలను ఫ్రిజ్జులుగా వినియోగిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో చతిస్గడ్,బిజాపూర్ ప్రాంతం నుండి ప్రాంత శాలివాహనులు బొలెరో వాహనాలలో ఎర్రటి మట్టి కుండలను వెంకటాపురం మండల కేంద్రం లోని ప్రధాన రహదారి రెవిన్యూ కార్యాలయం వద్ద ఒక్కొక్క మట్టి కుండ సైజులు బట్టి రూ. 400 నుండి 300, 200, 100 ధర వరకు విక్రయాలు జరుపు తున్నారు. అందంగా కనపడే విధంగా కుఃడల పైభాగంలో పూల డిజైన్ లు సైతం శాలివాహనులు తీర్చిదిద్ది కొనుగోలు దారులను ఆకర్షిస్తున్నారు.