భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు
వెంకటాపురం, సెప్టెంబర్ 4, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు నాగారం ఉన్నత పాఠశాలలో భారత మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (సెప్టెంబర్ 5) పురస్కరించుకొని ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సోయం ఆనందరావు జ్యోతి ప్రజ్వలన చేసి, రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన విద్యారంగానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు పూల మాలలు, బొకేలు అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోరిక స్వరూప్ సింగ్, చల్ల గురుగుల మల్లయ్య, వెంకట రమణ, రంగు ఆనంద్, నూనావత్ శ్రీకాంత్, కంచు ప్రభాకర్, తెల్లం రాజ్యలక్ష్మి, షిండే రాజేష్, కోకిల శ్రీరంగం, జర్పుల వస్య తదితరులు పాల్గొన్నారు.