గంగారంలో ప్రజల పైకి దూసుకెళ్లిన కారు

గంగారంలో ప్రజల పైకి దూసుకెళ్లిన కారు

గంగారంలో ప్రజల పైకి దూసుకెళ్లిన కారు

– ఇద్దరు మృతి..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారం గ్రామం ఎస్సీ కాలనీలో రోడ్డు పక్కన ప్రజలు ముచ్చటిస్తుండగా అదుపు తప్పిన కారు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. ముగ్గురికి తీవ్ర గాయాల య్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఒక కారు లోపలువురు కాలేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుండగా గంగారం గ్రామంలో ఎస్సీ కాలనీలోకి కారు హఠాత్తుగా దూసు కెళ్లింది. గృహాల ముందు కాలనీకి చెందిన వ్యక్తులు పలువురు మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్నగర్ ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు కాలేశ్వరం నుండి గంగారం ఎక్స్ రోడ్ వైపు వెళుతుండగా అదే సమయంలో కారు వీరిపైకి దూసుకెళ్లింది. తాగిన మైకంలో ఉన్న కారు డ్రైవర్ మద్యం తాగిన మత్తులో నడుపుతూ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి రోడ్డుపై నుండి కుడివైపు వెళ్లి కారు చెట్టును ఢీకొని పక్కనే ఉన్న మనుషులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మారుపాక మధునమ్మ (75)అక్కడికక్కడే మరణించింది.నీలాల బానయ్య (65) తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్ తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే మృతి చెందారు. నీలాల మల్లయ్య తో పాటు మరో బాలుడు డానియల్ (7) ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. తీవ్రంగా గాయపడిన నీలాల మల్లయ్యను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిందా వెంటనే నలుగురు వ్యక్తులలో ముగ్గురు పారిపోగా ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గ్రామీణ వాతావరణం.. ఎండాకాలం కావడంతో వాకిట్లో చల్లగా ఉండడంతో ఇరుగు పొరుగువారు గుమకూడి సరదా ముచ్చట్లు పెడుతుండగా యముడి రూపంలో వచ్చిన కారు ఇద్దరిని బలి తీసుకుంది. కారు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం మూలంగా రెండు ప్రాణాలు గాలిలో కలిశాయి. సంఘటన స్థలానికి కాటారం సీ ఐ నాగార్జున రావు, ఎస్సై అభినవ్, ఎస్ ఐ 2 శ్రీనివాస్ చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

సరస్వతి పుష్కరాలలో వడదెబ్బతో మరణించిన మంతెన సమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు గంగారంకు వస్తున్న ఎంపీ వంశీకృష్ణకు రోడ్డు ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు రోడ్డు ప్రమాదం జరిగి గంటసేపు కావస్తున్న పోలీసులు సకాలంలో స్పందించలేదని వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు సకాలంలో బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ స్థానికులు పోలీసులకు సమాచారాన్ని చేరవేసిన ప్పటికీ స్పందించడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో పోలీసులు చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. తాగిన మైకంలో రాష్ డ్రైవింగ్ పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని పోలీసుల ను నిలదీశారు. డెడ్ బాడీలను పరిశీలించారు. తీవ్ర గాయాల పాలైన కుటుంబ సభ్యులను పరమర్శించి ఓదార్చారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment