అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయిన కారు
వెంకటాపురం,అక్టోబర్9,తెలంగాణజ్యోతి: ములుగుజిల్లా వెంకటాపురం –నూగూరు గ్రామాల మధ్య గురువారం మధ్యాహ్నం ప్రమాదం తృటిలో తప్పింది. వెదుళ్ళు చెరువు సమీపంలో వెళ్తున్న కారు రహదారిపై ఉన్న గోతుల్లో పడటంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకు పోయింది. కారులో డ్రైవర్ ఒక్కరే ఉండగా, అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. సమాచారం అందుకున్న స్థానికులు, జేసీబీ సాయంతో కారును రహదారిపైకి తీసుకువచ్చారు.