పాల వ్యానును ఢీకొన్న కారు – డ్రైవర్ కు గాయాలు
ములుగు, అక్టోబర్ 19 (తెలంగాణ జ్యోతి): ములుగు పట్టణంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. జాతీయ రహదారిపై పాలు సరఫరా చేస్తూ వెళ్తున్న వ్యాన్ను వెనుకనుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. హనుమకొండ నుంచి వాజేడు బొగత జలపాతం దర్శనానికి బయల్దేరిన కారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలన జరుపుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.