అంబేద్కర్ యూత్ కు క్యారమ్ బోర్డ్ అందజేసిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
కన్నాయిగూడెం, ఆగస్టు 30, తెలంగాణ జ్యోతి : మండలం లోని చింతగూడెం గ్రామ పంచాయతీ నేతకాని వాడలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని బొమ్మ ప్రతిష్టించారు. ఈ సందర్భంలో యువతకు క్యారమ్ బోర్డ్ అవసరం అని అంబేద్కర్ యూత్ నాయకుడు దుర్గం రాజేష్, బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబుని ఫోన్ ద్వారా కోరగా ఆయన వెంటనే స్పందించి క్యారమ్ బోర్డును అందించారు. క్యారమ్ బోర్డు అందించి నందుకు యువత ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ చింతగూడెం గ్రామ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ దుర్గం నారాయణ, మండల యువజన నాయకులు దుర్గం రాజేష్, గోస్కుల రాంబాబు, కావీరి మోహన్, దుర్గం మల్లయ్య, దుర్గం సుమన్, దుర్గం మనోహర్, దుర్గం మల్లికార్జున రావు, కావీరి రఘు, కావీరి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.