బిఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
– నియోజకవర్గ ప్రజలకు సేవకునిగా పని చేస్తా
– ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పెద్దపెల్లి జడ్పీ చైర్మన్, మంథని నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీ హర్షిని రాకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తనును గెలిపిస్తాయని, అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని వేడుకున్నారు. ప్రజలను నమ్ముకుని ముందుకెళ్తున్నానని , ప్రజలే తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రంతోపాటు కాటారంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటుచేసి ఈ ప్రాంత అభివృద్ధికి మరింత సమయాన్ని కేటాయిస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గానికి వచ్చే 3 వేల ఇండ్ల తో పాటు మరో రెండు వేల అదనంగా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి సంవత్సరం పేద కుటుంబాలకు చెందిన అమ్మాయి, అబ్బాయిలకు సొంత ఖర్చులతో ఉచిత వివాహాలు చేయిస్తానని పేర్కొన్నారు. హైదరాబాదులో చదువుకునే, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థి విద్యార్థులకు ఉచిత హాస్టల్, భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. స్థానిక అవసరాల కోసం ప్రత్యేక ఇసుక పాలసీ తీసుకొచ్చి ఇండ్లు నిర్మించుకునే వారికి ఇసుకను తక్కువ ధరలకు లభించేటట్లు చేస్తానని తెలిపారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారితో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తోట జనార్ధన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్రు నాగయ్య, కాటారం సర్పంచ్ తోట రాధమ్మ, యూత్ అధ్యక్షులు రామిళ్ళ కిరణ్, మంథని డివిజన్ అధ్యక్షులు భూపెల్లి రాజు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కుడుదుల రాజబాబు, సెగ్గెం రాజేష్, మహిళా అధ్యక్షురాలు రత్న సౌజన్య రెడ్డి, సింగిల్ విండో సొసైటీ వైస్ చైర్మన్ దబ్బేట స్వామి, మాజీ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దబ్బెట రాజేష్, ఎంపీటీసీలు బండం రాజమణి, బాసాని రవి, నాయకులు శ్రీ లక్ష్మీ చౌదరి, వంగల రాజేంద్ర చారి, సుంకరి మల్లేష్, తైనేని సతీష్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు.
1 thought on “బిఆర్ ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలి”