పోరిక శ్యామల్ నాయక్‌ను పరామర్శించిన బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు
ఆరోగ్యంపై ఆరా – పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా
ములుగు, సెప్టెంబర్ 7, తెలంగాణ జ్యోతి : కళాకారుడు, ములుగు జిల్లా బీఆర్‌ఎస్ సాంస్కృతిక కార్యదర్శి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు పోరిక శ్యామల్ నాయక్ అనారోగ్యంతో ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆదివారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ రావు ఆయనను పరామర్శించి, పార్టీకి, ప్రజలకు అవసరమైన వ్యక్తి కావడంతో ఎప్పుడైనా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ గోవింద్ నాయక్, ఒజ్జల ఓదెలు, సురేష్, కవ్వంపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్యామల్ నాయక్ ఆరోగ్యంపై లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేతలు, కళాబృంద సభ్యులు, పాస్టర్లు, ప్రజాసేన, సిపిఐ, సిపిఎం నాయకులు, రైతు కూలీ సంఘం నాయకులు ఆరా తీసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.