శ్రావణమాస పూజలకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు హాజరుకావాలి
– మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
నారాయణపేట, జూలై 29,తెలంగాణ జ్యోతి : బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ రాయచూరులోని నవోదయ మెడికల్ కళాశాల ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూలై 30 బుధవారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించబడనున్న శ్రావణ మాస పవిత్రోత్సవ పూజల్లో పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు యస్. రాజేందర్ రెడ్డి ఆకాంక్షించారు. స్వామివారి ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదం అందుకోవడం ద్వారా అంతా శుభకాంక్షలు పొందాలని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులంతా ఈ పవిత్ర కార్యక్రమానికి తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.