పత్తి రైతులను నిండా ముంచుతున్న దళారులు
– యు వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఆరుగాలం కష్టపడి పనిచేసి గిట్టు బాటు ధరలు లభించక పత్తి పండిస్తే కాటన్ కార్పొరేషన్ అప్ ఇండియా (సీ సీ ఐ) కొనుగోలు కేంద్రాలు లేక గ్రామాల లోనే మద్య దళారులకు పత్తి పంట ను 5800 నుండి 6500 రూ. క్వింటాల్ కు రైతులు అమ్ముకుంటున్నారని భారత ఐక్య యువజన సమాఖ్య ( యు వై ఎఫ్ ఐ) రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కేంద్రం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేస్తే రైతుకు కొంత మేలు జరిగేది కానీ కేంద్ర ప్రభుత్వం రైతులకు 3 వ్యతిరేక చట్టాలు తెచ్చి స్వేచ్ఛా మార్కెట్ పేరిట పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల కు పెద్ద పీట వేసి మద్య దళారులను పెట్టీ తమకు నచ్చినట్లు గా తక్కువ ధరలకు రైతుల పత్తి పంట లను కొనుగోలు చేస్తున్నాయనీ విమర్శించారు .ఈ రోజు జయశంకర్ జిల్లా కాటారం మండల పరిధిలోని కొన్ని గ్రామాలలో అక్రమ పద్ధతులలో పత్తి నీ కొనుగోలు చేసే వారిని గమణించామని, వారి వాహనాలను నిలిపివేసి ప్రశ్నించడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా మార్కెట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్ల అక్రమ వ్యాపారులకు అడ్డు లేకుండా పోయిందనీ ఆరోపించారు. ఈ అక్రమ పత్తి వ్యపా రానికి అడ్డుకట్టు వేసి సీ సీ ఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధరలు కల్పించాలని భారత ఐక్య యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందనీ పేర్కొన్నారు. లేని పక్షంలో రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకుడు దయ్యం పోచయ్య పాల్గొన్నారు.