ములుగు జిల్లా అథ్లెటిక్స్ లో బ్రిలియంట్, వివేకవర్ధిని విద్యార్థుల ప్రతిభ

ములుగు జిల్లా అథ్లెటిక్స్ లో బ్రిలియంట్, వివేకవర్ధిని విద్యార్థుల ప్రతిభ

ములుగు జిల్లా అథ్లెటిక్స్ లో బ్రిలియంట్, వివేకవర్ధిని విద్యార్థుల ప్రతిభ

ములుగు, జూలై 31, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా జాకారం పి జి డబ్ల్యూ ఆర్ ఎస్ వేదికగా జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలెక్షన్స్‌లో బ్రిలియంట్ & వివేకవర్ధిని పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభను కనబర్చారు. ఈ సెలెక్షన్స్‌లో భాగంగా అండర్-16 క్యాటగిరీలో  విద్యార్థి ఎం. శ్రావణ్ లాంగ్ జంప్‌లో మొదటి స్థానం, టీ. చరణ్ 600 మీటర్ల పరుగులో మొదటి స్థానం సాధించి రాష్ట్ర స్థాయిలో పాల్గొనడానికి అర్హత సాధించారు. విద్యార్థుల  విజయంపట్ల పాఠశాల యాజమాన్యం చిర్రా నరేష్ గౌడ్, ముద్దం సంతోష్ చక్రవర్తిలు  అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “రాష్ట్ర స్థాయిలో కూడా మా విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి ములుగు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల పీఈటీలు సురేష్, పవన్, రాజులతో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను ప్రోత్సహించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment