అమరావతి విద్యాలయంలో ఘనంగా బోనాల పండుగ
వెంకటాపూర్, జూలై 19, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేటలోని అమరావతి విద్యాలయంలో శనివారం విద్యార్థులచే బోనాల పండుగను ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో బోనాలు ఎత్తుకొని ఆటపాటలతో, నృత్యాలతో పండుగను కనువిందు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వీరగాని రాజయ్య మాట్లాడుతూ “తెలంగాణలో బోనాల పండుగ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నదన్నారు. విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను నూరి పోసేందుకు ఇలాంటి ఉత్సవాలు ఉపయోగ పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మూల రాజయ్య, వీరగాని ఆనందం, ఉపాధ్యాయులు సుమలత, జెరుపోతుల కిరణ్, పుట్ట నవ్య, యాదండ్ల కవిత, పొన్నం మౌనిక, జేరిపోతుల ఇందు, పోరిక సోనీతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.