మల్లంపల్లి శ్రీ వివేకానంద పాఠశాలలో బోనాల సెలబ్రేషన్స్
ములుగు ప్రతినిధి : శ్రావణ (బోనాల) మాసం సందర్భంగా మల్లంపల్లి వివేకానంద హై స్కూల్ లో అంగరంగ వైభవంగా బోనాల పండుగను నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి అమ్మవారికి బోనం ఏర్పా టు చేసి డప్పు చప్పుళ్ల తో అమ్మవారికి పాఠశాల ఆవరణ లోని అమ్మవారి చిత్రపటం వద్ద బోనాలు పెట్టి ఆటపాటలతో పోతరాజుల విన్యాసాలతో అమ్మవారికి బోనాలు సమర్పిం చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కొమ్మెర సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ కోమ్మెర ప్రేమలత రెడ్డిలు మాట్లా డుతూ అమ్మవార్లకు మొక్కులు సమర్పించి ఈ సీజన్లో ప్రజలకు, స్కూల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవాలని అమ్మవారిని ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యుని, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.