ములుగులో బోనాల సంబురాలు

ములుగులో బోనాల సంబురాలు

ములుగులో బోనాల సంబురాలు

బ్రిలియంట్ విద్యార్థుల ప్రదర్శన

ఎన్ హెచ్ పై బోనాలతో ర్యాలీ

ములుగు ప్రతినిధి, జూలై 21, తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్‌, వివేకవర్ధిని హై స్కూల్ ల ఆధ్వర్యంలో బోనాల పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్లు సంతోష్ చక్రవర్తి, నరేష్ గౌడ్ నేతృత్వంలో భక్తిశ్రద్ధలతో సంప్రదాయ బద్దంగా జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతురాజు, అమ్మవార్ల వేషధారణలో నృత్యాలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పండుగ ఉత్సాహాన్ని ప్రజల్లో కలుగజేసేలా విద్యార్థులు మట్టిబోనాలతో, గోవింద గోపాల, డీజే పాటలతో ప్రధాన రహదారిపై ర్యాలీగా సాగారు. పూలతో అలంకరించిన బోనాలతో ముత్యాల శోభను తలపించే విధంగా ర్యాలీ కొనసాగింది. ప్రతి ఒక్కరూ విద్యార్థుల ప్రతిభను, భక్తి వైభవాన్ని ప్రశంసించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థి నుల నృత్యాలు, గేయాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు ఈ వేడుకలో భాగస్వాములై విద్యార్థులను అభినం దించారు. బోనాల పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతికతకు ప్రతీక గా నిలుస్తుందనీ, ఈవిధంగా స్కూల్‌ స్థాయిలో జరగడం సంతోష కరమని డైరెక్టర్లు సంతోష్, నరేష్ లు పేర్కొన్నారు.

ములుగులో బోనాల సంబురాలు

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment