విఆర్కెపురంలో చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్య క్షులు చిడెం సాయి ప్రకాష్ ఆధ్వర్యంలో రక్తహీనత వ్యాధితో బాధపడుతున్న పిల్లలు కొరకు రక్తదాన శిబిరం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకటాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అశోక్ హాజరై రక్తదానం చేసినటు వంటి సుమారు 20 మంది యువకులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల సర్పంచ్ సంఘం అధ్యక్షురాలు వి ఆర్ కె పురం సర్పంచ్ పూనెం శ్రీదేవి, బి ఆర్ ఎస్ మండల అధికార ప్రతినిధి డర్ర దామోదర్, యూత్ రాంప్రసాద్, నాగేశ్వరరావు, దినేష్, సతీష్, నాని, రవి, శ్రీను, నరేందర్, గుండమ్మల మధు, గ్రామపంచా యతీ సిబ్బంది వెంకటేష్, సతీష్ ,తదితరులు పాల్గొన్నారు.
2 thoughts on “విఆర్కెపురంలో చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ”