వాజేడులో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు

On: April 6, 2026 12:35 PM

వాజేడులో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు

వాజేడులో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు

వాజేడు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: వాజేడు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జెండా ఎగరవేసి ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. మండల అధ్యక్షుడు పెద్ది జగపతి బాబు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఎదగడం గర్వకారణమని తెలిపారు. కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేస్తే రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు కందుల రామ్ కిషోర్, సీనియర్ నాయకులు సాగి సీతారామరాజు, సండ్ర సోమరాజు, యాలం సుబ్బయ్య, ఎడ్జర్లపల్లి సర్పంచ్ అట్టం మమత తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!