ఇంటింటికి బీజేపీ – మహా సంపర్క్ అభియాన్ ప్రారంభం

ఇంటింటికి బీజేపీ – మహా సంపర్క్ అభియాన్ ప్రారంభం

ఇంటింటికి బీజేపీ – మహా సంపర్క్ అభియాన్ ప్రారంభం

ములుగు, ఆగస్టు 3, తెలంగాణ జ్యోతి : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్న ఇంటింటికి బిజెపి – మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని ములుగు పట్టణంలో మండల అధ్యక్షుడు రాయంచు నాగరాజు ఆధ్వర్యం లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, బీజేపీ పాలనలో ప్రజలకు అందిన సంక్షేమ ఫలితాలపై అవగాహన కల్పించారు. గ్రామీణాభివృద్ధి, యువత సాధికారత, మహిళా అభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి అంశాలపై విశదంగా వివరించడంతో పాటు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్య పాలన ప్రజల జీవితాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. అవినీతి, మోసాలతో నిండిన పాలనకు స్వస్తి పలికి బీజేపీకి ఓటేయాలంటూ పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఇంటింటికి వెళ్లి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ఉజ్వలా యోజన, ముద్రా యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన, పీఎం కిసాన్, స్వచ్ఛ భారత్ వంటి పథకాల వివరాలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఇంటింటికి బీజేపీ – అభివృద్ధి ప్రతి ఇంటికీ అనే లక్ష్యంతో  ప్రచారాలు ముమ్మరం చేస్తున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు భూక్యా జవహర్‌లాల్, జిల్లాప్రధానకార్యదర్శి శ్రీలమంతుల రవీంద్రాచారి, జిల్లా నాయకులు నగరపు రమేశ్, సూర్యదేవర విశ్వనాథ్, గంగిశెట్టి రాజ్ కుమార్, దొంతి రెడ్డి రవిరెడ్డి, ఏరువు పాపిరెడ్డి, సాగర్, డీవీ రెడ్డి, బీజేవైఎం నాయకులు భూక్యా సుధీర్, పూర్ణచందర్, అరుణ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment