వెంకటాపురంలో భద్రాచలం ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు
వెంకటాపురం నూగూరు, జనవరి 25 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పుట్టినరోజు వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పరస్పరం మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చిడెం మోహన్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడం సాంబశివరావు, వెంకటాపురం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టం సాయి, వెంకటాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ తాటి సరస్వతి, ఉపసర్పంచ్ సర్బుద్దిన్, ములుగు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మన్యం సునీల్ బాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దనపనేని నాగరాజు పటేల్, డి. రవి, మురళి, జి. నాగేశ్వరావు, చిడెం ముత్తయ్య, తిప్పని సమ్మయ్యతో పాటు పలువురు కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, మేజర్ పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.






