ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాల లోనే మెరుగైన విద్య
– లక్ష్మీదేవి పేటలో పదవ తరగతి వంద శాతం ఉత్తీర్ణత
-వెంకటాపూర్ ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూడు వీరేష్
వెంకటాపూర్ జూన్ 3, తెలంగాణ జ్యోతి : ప్రైవేటు పాఠశాల ల కంటే ప్రభుత్వ పాఠశాల లోనే మెరుగైన విద్య అందిస్తు న్నారని ఎస్టీసెల్ వెంకటాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూడు వీరేష్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలో తన విద్యార్థులను చేర్పించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని పేర్కొన్నారు. నా కూతురు లక్ష్మీదేవి పేట ప్రభుత్వ పాఠశాలలోని చదివించి పదో తరగతిలో మండలంలో రెండో ర్యాంకు సాధించింది అన్నారు. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులు టాప్ ర్యాంక్ లో నిలిచారని అన్నారు. లక్ష్మీదేవి పేట పాఠశాలలో అర్హత కలిగిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, సంవత్సరం నుండి విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ వారికి ఉత్తమ బోధన అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివేవిద్యార్థులకు ఉచితంగా స్కూల్ యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు నోటుపుస్తకాలు ప్రభుత్వం అందజే స్తుందని మండలంలోని ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.