సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

– డీసీహెచ్‌ఓ డాక్టర్ జగదీశ్వర్

ఏటూరునాగారం, జూలై 25, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో వైద్యశాల సూపరిండెంట్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల పట్ల సమావేశం నిర్వహించగా డీసీహెచ్‌ఓ జగదీశ్వర్‌ హాజరై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన  మాట్లాడుతూ వర్షా కాలంలో విష జ్వరాలు ప్రబలుతాయని, పేషెంట్లకు ముందస్తు గానే వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవా లన్నారు. జ్వర లక్షణాలతో వచ్చే ప్రతి ఒక్కరికి తగిన పరీక్షలు నిర్వహించి మందులు తక్షణమే అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది తమ డ్యూటీలకు సమయానుకూలంగా హాజరై, రోగులకు 24 గంటలూ సేవలందించాలని డాక్టర్ జగదీశ్వర్‌రావు సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ సీజన్ జ్వరాల నివారణకు ప్రతిరోజూ వైద్యులు అందుబాటులో ఉంటూ అవసరమైన సేవలు అందిస్తున్నామన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment