Batukamma | అంబరాన్ని అంటిన ఆదివాసి బతకమ్మల సంబరాలు. 

Batukamma | అంబరాన్ని అంటిన ఆదివాసి బతకమ్మల సంబరాలు. 

  • పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళా సోదరీమణులు. 
  • వెంకటాపురం పట్టణాన్ని హోరెత్తించిన బతుకమ్మ పాటలు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలలో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం లో ఆదివాసీ బతుకమ్మ సంబరాలు గురువారం సాయంత్రం అంగ,రంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆదివాసీ మహిళా సోదరీమణులు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, గిరిజన సంఘాలు, ఆబాల గోపాలం పెద్ద సంఖ్యలోఆదివాసి మహిళా సోదరీమణులు బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటాపురం పట్టణ నడిబొడ్డున వున్న దేవస్థానం విశాలమైన గ్రౌండ్లో బతుకమ్మ సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య , మేడారం సమ్మక్క సారలమ్మ ప్రతిరూపాలైన భారి బతుకమ్మలను, అందంగా అలంకరించి, పూజ కార్యక్రమాలుతో కొబ్బరికాయలు కొట్టి సంబరాలను ప్రారంభించారు .ఆదివాసి పేరంటాలు గౌరవనీయులు వెంకటాపురం మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ జజ్జరి నారాయణమ్మ తో కొబ్బరికాయ కొట్టి ప్రధాన బతుకమ్మ ను ప్రాంగణంలోకి తీసుకుని వచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం మహిళా సోదరీమణులు తీసుకువచ్చిన చిన్న బతుకమ్మలను సైతం అందంగా పేర్చి బతుకమ్మ సంబరాలను ప్రముఖులతో, పెద్దలతో కొబ్బరికాయలు కొట్టించి మైక్ వ్యాఖ్యానంతో సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటల డి.జె. సౌండ్ సిస్టంతో శ్రావ్యమైన పాటల కంఠాస్పరాలతో ఉత్సాహపరిచే సంగీతంతో బతుకమ్మ పాటలు, వెంకటాపురం పట్టణ నలుమూల వినపడే విధంగ ఏర్పాటుచేసి పాటల కు అనుగుణంగా, మహిళా సోదరీమణులు ,ఆడి పాడి బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సంబరాల నిర్వాహకులు, బతుకమ్మ సంబరాలు ను తిలకించేందుకు వచ్చే ప్రజలకు మంచినీటి సదుపాయంతో, సౌకర్యాలు కల్పించారు. ఆదివాసి ఉపాధ్యాయ సంఘాలు, ఆదివాసి ఉపాధ్యాయ,ఉద్యోగ మహిళా సోదరీమణులు, ఆదివాసి మహిళా సంఘాలు ఆదివాసి గ్రుహిణులు, దసరా సెలవుల విద్యార్థులు, బాలికలు వందల సంఖ్యలో పాల్గొని, బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రతి ఏడాది దేవస్థానం ప్రాంగణంలో ఆదివాసి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించే,సంప్రదాయ చర్యల్లో భాగంగా, గురువారం ఆదివాసి బతుకమ్మ సంబరాలు రాత్రి పొద్దుబోయే వరకు కొనసాగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ఆదివాసి బతుకమ్మల సంబరాలు తో వెంకటాపురం పట్టణం మారుమోగింది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment