లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో బతుకమ్మ పండుగ సంబరాలు
ములుగు ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో గురువారం బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ శెల్మా మాట్లాడుతూ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ అని బతకమ్మ యొక్క విశిష్టత గురించి ప్రత్యేకతల గురించి విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు బతుకమ్మలను తీరు తీరుల పూలతో పేర్చి పాఠశాలలో బతుకమ్మ పాటలతో ఆడారు . విద్యార్థులు తీసుకొచ్చిన బతుకమ్మల అలంకరణలను పరిశీలించి న పాఠశాల యాజమాన్యం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిస్టర్ గ్రేస్ హైమావతి ,ఆశ, ప్రియాంక ,రమణాచారి ,లక్ష్మణ్, మధుసూదన చారి ,పద్మ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.