ఊరూరా సద్దుల బతుకమ్మ సంబరాలు
వెంకటాపురం, సెప్టెంబర్29, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామాలన్నీ బతుకమ్మలతో హోరెత్తాయి. పట్టణాల నుండి చామంతి, గులాబీలు, బంతి పూలు గ్రామ గ్రామాలకీ చేరి విక్రయమయ్యాయి. మండల కేంద్రంలోని వెంకటాపురంలో శివాలయం వద్ద నుండి కంకల వాగు వంతెనవరకు వెంకటాపురం మేజర్పంచాయతీ ఆధ్వర్యం లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. రాత్రి పొద్దుబోయే వరకు బతుకమ్మల సంబరాలు కొనసాగి, వాగులో నిమజ్జనం జరి పారు. ప్రతి గ్రామంలోనూ బతుకమ్మల సందడి అలరించింది.