మహర్షి కళాశాలలో బతుకమ్మ సంబరాలు
ములుగు ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని మహర్షి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నేడు కళాశాల ఆవరణలో కరస్పాండెంట్ తుమ్మ పిచ్చిరెడ్డి అధ్యక్షతన బతుకమ్మ సంబరాలను విద్యార్థులు నిర్వహించారు. తీరొక్క పువ్వులతో విద్యార్థులు బతుకమ్మను స్వయంగా పేర్చి ఆట పాఠలతో సంబరాలు జరుపుకున్నారు. కరస్పాండెంట్ పిచ్చిరెడ్డి మాట్లాడుతూ సీజనల్ గా ప్రకృతి సిద్ధంగా లబించే రంగు రంగుల పువ్వులను సేకరించి బతుకమ్మను పేర్చి మద్యలో గౌరమ్మ ను పెట్టి సంబరాలు జరుపుకునే ఈ వేడుకలు ఆడపడుచులకు ఉనికికి ఆ వారి ఆత్మగౌరవానికి నిదర్శనమ న్నారు. పువ్వుల రూపంలో ప్రకృతిని, శ్రీశక్తిని ఆరాదించే విషిష్టమైన పండుగ బతుకన్ను పండగ అని అన్నారు. బతుకమ్మలో పేర్చే ప్రతి పువ్వు యొక్క విషిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంజయ్ కుమార్, డైరెక్టర్ వెంకటరెడ్డి, అద్యాపకులు సుధాకర్, కుమార్, సుమన్, మౌనిక, రమ్య, వీరేష్, విద్యార్థులు పాల్గొన్నారు.