బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.
– అధ్యక్షులుగా ముసరగాని వినయ్ కుమార్
ములుగు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా బార్ అసోసి యేషన్ ఎన్నికలు గురువారం జరిగాయి. ములుగు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలక్షన్స్ లో భాగంగా అధ్యక్షులుగా మసరగాని వినయ్ కుమార్, ఉపాధ్య క్షులు బజారు శ్యాంప్రసాద్, జనరల్ సెక్రెటరీ కన్నోజు సునీల్ కుమార్, జాయింట్ సెక్రెటరీ రాధారపు శ్రీనివాస్, బి రామ్ సింగ్, లేడీ జాయింట్ సెక్రెటరీ మేకల మానస, ట్రెజరర్ బానోతు స్వామి దాస్, కల్చరల్ అండ్ స్పోర్ట్స్ సెక్రటరీ ఓరుగంటి రాజేందర్, ఈసీ మెంబర్స్ బల్ల ప్రతాప్, కొడపాక సుస్మిత, నవత, డి సంజీవ, మేకల అశోక్, మాజీ అధ్యక్షులు వై నర్సిరెడ్డి, బి చంద్రయ్య, వేణుగోపాల చారి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఎన్నికైనారు. ఎన్నిక అనంతరం బార్ సభ్యులు అందరూ సమిష్టిగా బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఎన్నికైన సభ్యులు బార్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపినారు.