అగ్రికల్చర్ ఆస్మాకు అవార్డు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : విధులలో ఉత్తమ పని తీరు కనబరిచినందుకు ప్రభుత్వం తరఫున గౌరవించే అరుదైన పురస్కారం కాటారం మండలం వ్యవసాయ శాఖ అధికారిని అస్మాకు లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ కరే, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేతుల మీదుగా కాటారం వ్యవసాయ శాఖ అధికారిని ఆస్మ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. తనకు అవార్డు రావడం పట్ల సంతోషాన్ని ఆస్మా వ్యక్తం చేశారు. అవార్డు పొందిన ఆస్మాకు కాటారం మండలం ఆశాఖ అధికారులు, సిబ్బంది, పుర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.