అటల్ టింకరింగ్ ల్యాబ్ శిక్షణ ప్రారంభం
ములుగు, జులై 24, తెలంగాణ జ్యోతి : జిల్లాలోని ఏడు పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలకు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ మంజూరైన నేపథ్యంలో ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు చొప్పున 21 మంది ఉపాధ్యాయులకు బండారుపల్లి తెలంగాణ మోడల్ స్కూల్‌లో రెండు రోజుల శిక్షణ నిర్వహిస్తున్నారు. 3డి ప్రింటింగ్, రోబోటిక్స్, సైన్స్, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అంశాల్లో కేంద్ర బండారు నిపుణుల ద్వారా శిక్షణ ఇస్తున్నామని డిఇఓ చంద్రకళ తెలిపారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థులకు ఈ సాంకేతికతపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ మల్లారెడ్డి, సైన్స్ అధికారి జయదేవ్, ప్రిన్సిపల్ దేవకిదేవి, రిసోర్స్ పర్సన్లు శ్యామ్, అన్వేష్, నిరంజన్ పాల్గొన్నారు.