వాజేడు హైస్కూల్ ఆవరణలో ఏ.టి.ఎ. క్యాలెండర్ ఆవిష్కరణ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ సంఘం క్యాలెండర్ 2025 ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద రావుఏ.టి.ఎ.నుఆవిష్కరించారు.ఈసందర్భంగా సంఘం సభ్యు లకు నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ.టి.ఎ. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బోదె బోయిన పరమేశ్వరరావు, చేలే నాగేంద్ర ప్రసాద్, ఎట్టి రామ్ భూపతి, బోదెబోయిన శ్రీనివాసరావు, మడప ఈశ్వర రావు, చింత మనోజ్ కుమార్, బి. కవిత, వెంకటరమణ, సునీత, విష్ణు ప్రియా, రాజ్యలక్మి, ఎ.టి.ఏ. సంఘం టీచర్లు పాల్గొన్నారు.