కన్నుమూసిన అశ్వరావుపేట ఎస్సై శ్రీరాములు
భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ జ్యోతి : అశ్వరావుపేట SI శ్రీరాములు శ్రీనివాస్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో SI గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరాములు శ్రీనివాస్ గత నెల 30వ తారీఖున పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విధితమే… ఆత్మహత్యాయత్నం చేసిన ఆయనకు చివరి నిమిషంలో భార్యాబిడ్డలు గుర్తు వచ్చి వారి కోసమైనా బతకాలని ఆయనే 108 కి కాల్ చేసి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఆయనకు హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో చికిత్స జరుగుతూ ఉన్నది. గత ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఇప్పటికే ఎస్సై ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో సీఐ జితేందర్ రెడ్డి, నలుగురు కానిస్టేబుల్ పై అట్రాసిటీ కేసును ఉన్నతాధికారులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపద్యంలో అశ్వారావుపేటలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు ఎటువంటి అల్లర్లు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.