ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులకు వాగ్వాదం
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని చిన్న బోయినపల్లి గ్రామ పంచాయితీ పరిధి పెద్ద వెంకటాపురం కు చెందిన రైతుకు అటవీశాఖ అధికారులకు వాగ్వాదం జరిగింది. హుస్సేన్ తన పట్టా భూమిలో చదును చేస్తుండగా అధికారులు అడ్డుకుని జేసీబీ, 4 ట్రాక్టర్ లను కార్యాల యానికి తరలిస్తుండగా రైతు ఎంత వేడుకున్న అటవీశాఖ అధికారులు వికపోవడంతో ఒంటి పై డిజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో గ్రామస్తులంతా రైతుకు మద్దతుగా నిలబడి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులు అందించారు. గ్రామస్తులకు, అధికారుల మద్య వాగ్వాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలీసులు చేరుకొని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.