ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సన్మానం
ములుగు ప్రతినిధి, జూలై 5, తెలంగాణ జ్యోతి : ములుగు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బానోతు మోహన్ లాల్‌ను ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న బంజారా ఉద్యోగులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానించారు. హాస్పిటల్ అభివృద్ధి, ఆయన నేతృత్వంలో మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణసింగ్ నాయక్, జగ్గు నాయక్, పోరిక కిరణ్ కుమార్, వేణు భాస్కర్, నవీన్, స్వరూప, బాలు సర్దార్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.