ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : సి ఎస్ సి హెల్త్ కేర్ వెల్ నెస్ సర్వీసెస్ సంస్థలో ల్యాబ్ టెక్నీషియన్స్ (ఫ్లెబోటమిస్ట్) ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు చేసుకో వాలని జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నందు రిజిష్టర్ అయిన కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు చేయుటకు ఎంఎల్ టి, డిఎంఎల్ టి, జియన్ఎం, ఏఎన్ఎం, డిగ్రీ కోర్సు చేసిన వారు ఆర్హులని అన్నారు. ఈనెల 18 వ తేదీన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముఖాముఖి పరీక్షలు నిర్విహించడం జరుగుతుందని, జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగించు కోవాలన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే వారు తమ ఒర్జినల్ సర్టిఫి కెట్స్, బ్యాంక్ పాస్ బుక్, పాన్, ఆధార్, ఫొటోస్ తీసుకొని రావాలని తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఇతర వివరాల కోసం జిల్లా మేనేజర్, డివిజనల్ మేనేజర్, హెచ్ ఆర్ల ఫోన్ నెం. 94408446172, 9949221105, 96520 76728 లను సంప్రదించాలని జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చంద్రకళ తెలిపారు.