గణేష్ నవరాత్రుల సందర్భంగా 9వ రోజు అన్నప్రసాదం
వెంకటాపురం, సెప్టెంబర్4, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలలో శ్రీ గణపతి నవరాత్రుల భాగంగా 9వ రోజు ఉత్సవ మండపాల వద్ద ఘనంగా అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు తండోపతండాలుగా భక్తులు తరలి వచ్చారు. వెంకటాపురం మండల కేంద్రంలోని రజక బజార్, గిరిజన సహకార సంఘం (జి.సి.సి) వద్ద జరిగిన అన్న ప్రసాదానికి వందలాది మంది భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ మండపాల వద్ద పూజా కార్యక్రమాలు కూడా వైభవంగా నిర్వహించారు.