నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
ములుగు, ఆగస్టు 31, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని సఫాయి వాడ కాలనీలో నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాలనీకి చెందిన కూన చందర్ రావు ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాల లో భాగంగా నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేసినట్లు నక్క రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్క రాజు, ఉత్సవ నిర్వాహకులు కూన చందర్ రావు, కాలనీ వాసులు జన్ను రఘు, మర్రి మధు, ఐత రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.