విశేష పండ్ల అలంకరణలో ఆంజనేయస్వామి
కాటారం, జులై 29, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రమైన కాటారం శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాస మంగళవారం పురస్కరించుకొని భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ పూజారి నిఖిల్ శాస్త్రి వేకువజామునే శ్రీభక్త ఆంజనేయస్వామికి శివుడికి పంచామృతాభి షేకం నిర్వహించారు. సరిహద్దు మిలటరీ లో జవాన్ గా పనిచేస్తున్న కాటారంకు చెందిన సుంకరి గుణ పటేల్ ఆంజనేయ స్వామికి అరటిపండ్లతో అలంకరించారు. కాటారం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం నుండి 30 రోజులు శివుడికి రుద్రాభిషేకం, ఆంజనేయ స్వామికి ఆకు పూజలు,ప్రతి మంగళవారం విశేషమైన అలంకరణతో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పూజారి నిఖిల్ శాస్త్రి తెలిపారు. గోత్రనామాల తో పూజలు చేయించుకునే భక్తులు ఎవరైనా రూ 516 చెల్లిస్తే నెలరోజుల పాటు పూజలు చేయనున్నట్లు ఆలయ పూజారి నిఖిల్ శాస్త్రి వివరించారు.