పౌష్టికాహారంతోనే రక్తహీనత దూరం
కాటారం, తెలంగాణజ్యోతి: గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవ డం ద్వారా రక్తహీనతను నివారించవచ్చునని దేవరంపల్లి అంగన్వాడి టీచర్ కమలాదేవి సూచించారు గురువారం పోషణ పక్వాడ్ పక్షోత్సవాల సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో పోష కాహారంపై అవగాహన కల్పించి విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. బిడ్డ రెండు సంవత్సరాలు నిండే వరకు తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు మొదటి 1000 రోజులు పిల్లల ఎదుగుదలకు ఎంతో ప్రాధాన్యత ఉందని పిల్లలకు ఎలాం టి మానసిక శరీర సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని అంగన్వాడి టీచర్ ఎల్ కమలాదేవి తెలిపారు. పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తాగించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. గర్భిణీల ఎత్తు బరువు వంటి కొలతలు వేసి నమోదు చేసుకున్నారు. అనంతరం పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గర్భిణీలకు బాలింతలకు పిల్లలకు తల్లిదండ్రులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని వంట పాత్రలు ఆహారము చేసుకునే పాత్రలు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు కిషోర్ బాలికలకు హిమోగ్లోబిన్ మందు బిల్లల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తల్లులు,గ్రూపు సభ్యులు, కిశోర బాలికలు, ప్రజలు పాల్గొన్నారు.