వారం రోజుల క్రితం కాలిపోయిన విద్యుత్ మోటార్

వారం రోజుల క్రితం కాలిపోయిన విద్యుత్ మోటార్

వారం రోజుల క్రితం కాలిపోయిన విద్యుత్ మోటార్

– నీళ్లు లేక వెంకటాపురం ఆర్టీసీ బస్సు స్టేషన్ ప్రయాణికుల ఇబ్బందులు. 

– పట్టించుకోని ఆర్టీసీ అధికారులు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటా పురంలోని బస్ స్టేషన్ లో వారం రోజుల క్రితం విద్యుత్ మోటార్ కాలిపోవడంతో మరమ్మత్తులు చేయకపోవడంతో ప్రయాణికులు మరుగుదొడ్లు వినియోగం, మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినిత్యం సుమారు 40 కి పైగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ సర్వీసులు బస్ స్టేషన్ నుండి రాకపోకలు సాగిస్తున్నాయి. భద్రాచలం ఆర్టీసీ డిపోతో పాటు, వరంగల్ 2 డిపోల నుండి బస్సులు రాక పోకలు సాగిస్తుంటాయి.  ప్రయాణికులు మరుగు దొడ్లలో నీళ్లు లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. వారం రోజులుగా ఇదే తంతు కొనసాగిస్తున్న భద్రాచలం ఆర్టీసీ డిపో అధికారులు, ఖమ్మం ఆర్టీసీ రీజినల్ అధికారులు పట్టించుకోవటం లేదని ప్రయాణి కులు మండి పడుతున్నారు. అంతేకాక మహిళా కండక్టర్ లు సైతం మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్.టి.సి అధికారులు వెంటనే స్పందించి నీటి సౌకర్యం కల్పించాలని, ప్రయాణికులు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment