మేడి వాగు సమీపంలో పొలంలోకి దూసుకెళ్లిన ఆటో
– పలువురికి గాయాలు
తెలంగాణజ్యోతి, ములుగుప్రతినిధి : జిల్లా కేంద్రం సమీపం లోని మేడివాగు వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… కొండాయి గ్రామానికి చెందిన కోరం బిక్షపతి హనుమకొండ నుంచి కొత్త ఆటో తీసుకొని కొండాయి గ్రామానికి వస్తున్న క్రమంలో ములుగు డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద సమావేశానికి హాజరై వెళుతున్న ఫారెస్ట్ సిబ్బంది లిఫ్ట్ అడిగి ఆటో ఎక్కారు. మేడివాగు దాటగానే అదుపుతప్పి ఆటో పక్కనే ఉన్న వరి పొలాల్లోకి తీసుకెళ్లగా పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అటువైపు నుంచి వస్తున్న టిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాపులమర్రి లక్ష్మణరావు దగ్గరుండి వారిని ఆసుపత్రికి తరలించారు.
2 thoughts on “మేడి వాగు సమీపంలో పొలంలోకి దూసుకెళ్లిన ఆటో ”