భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

– అత్యవసరం అయితేనే ప్రజలు బయటికి రావాలి

– చేపల వేటకు, ఫోటో సెల్ఫీలు, వీడియో రీల్స్ కొరకు చెరువులు, కుంటల వద్దకు వెళ్ళవద్దు.

– క్షేత స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.

– నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.

– గ్రామాల్లో టామ్ టామ్ వేపించి ప్రజలను అలర్ట్ చేయండి.

– జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.

ములుగు ప్రతినిధి, ఆగస్టు 12, తెలంగాణ జ్యోతి : వచ్చే 4 రోజులు వాతావరణ శాఖ భారీ వర్షసూచన చేసిన నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తం గా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం వివిధ శాఖల అధికారులతో ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు లతో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అన్ని శాఖల అధికారులు తు చా తప్పకుండ పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతీ శాఖ అధికారులు వారి పరిధిలో గల విధులను బాధ్యత లను సజావుగా నిర్వర్తించాలన్నారు ఎలాంటి నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవన్నారు కాజ్ వే ల మీద ఎవ్వరు ప్రయాణం చేయకుండా చూడాలని, చెరువులు తెగే పరిస్థితి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలనీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్త లు తీసుకోవాలన్నారు కరెంట్ స్తంభాలు వద్ద జాగ్రత్త లు తీసుకోవాలని, ప్రధాన రహదారి వద్ద నీరు ఎక్కడ అయిన ఆగిపోతే వెంటనే స్పందించాలన్నారు. శితిలావస్థ భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు అన్ని సంక్షేమ హాస్టల్ లో విద్యార్థుల పట్ల జాగ్రత్త గా ఉండాలని, బయటకు రాకుండా చూడాలన్నారు. పొంగి పోర్లే వాగుల వద్ద ఎవరు వెళ్లకుండా చూడాలని వర్షాల వల్ల నీరు కలుషితమై దోమలు ప్రబలి సీజనల్ వ్యాధులు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, వైరల్ ఫీవర్ లాంటి వ్యాధుల ప్రబల కుండ జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ శాఖ అధికారులు తమ పరిధిలో గల సిబ్బంది తో వెంటనే సమావేశం పెట్టుకొని తగు ఆదేశాలు ఇవ్వాలన్నారు. టామ్ టామ్ వేపించి ప్రజలను అలర్ట్ చేయా లన్నారు. వర్షాకాలం దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు కంట్రోల్‌ రూమ్‌లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ, వర్షానికి, జలమాయమైయ్యే ప్రాంతాల సమస్య కు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగు తుందని కలెక్టర్ తెలిపారు. వరద ఉధృతి ఎక్కువ ఐతే వెంటనే జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ప్రజలు సహకరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment