తిరుమలలో అఖండ నామ సంకీర్తన
కాటారం,తెలంగాణజ్యోతి: జయశంకర్ భూపాలపల్లి కాటారం శ్రీవెంకటేశ్వర ధార్మిక కోలాట భజన మండలి తిరుమలలో రెండు రోజుల అఖండ హరినామ సంకీర్తనల భజన మండలి కార్యక్ర మంలో పాల్గొన్నారు. బుధవారం, గురువారం రెండు రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, శ్రీఆంజనేయుడు, శ్రీకృష్ణుడు, అమ్మవార్ల పేర్ల మీద గల సంకీర్తనలను కీర్తిస్తూ పాటలు పాడారు. రెండు రోజులు భజనలు చేసిన అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. 15 మంది సభ్యులు ఈ భజన మండలి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో కాటారం శ్రీ వెంకటేశ్వర ధార్మిక కోలాట భజన మండలి అధ్యక్షురాలు అనంతుల వసంతలక్ష్మి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీ చౌదరి, ఉపాధ్యక్షురాలు మద్ది నీరజ, భజన మండలి సభ్యులు అనంతుల అరుణాదేవి, మద్ది శ్రీదేవి, పవిత్రం నిర్మల,పడకంటి అంజలి, బీరెల్లి పావని,చందా శోభ రాణి, పద్మ అయ్యగారమ్మ, బోయినపల్లి సరిత, బండి స్వరూప, తబలా వాయిద్య కారుడు బీరెల్లి అంజయ్య, అనంతుల అనిత, ఎం ఎల్ ఎన్ మూర్తి పాల్గొన్నారు.