ఘనంగా ఎఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ములుగు, ఆగస్టు12, తెలంగాణ జ్యోతి : భారత స్వాతంత్ర్యం లక్ష్యంగా 1936 ఆగస్టు 12న లక్నోలో స్థాపించబడిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని ములుగు మండల ఇంచర్ల ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ కేక్ కట్ చేసి పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరంలో, స్వాతంత్ర్యం తరువాత విద్యా పరిరక్షణ, కామన్ విద్యావిధానం, శాస్త్రీయ విద్య సాధనకై ఎఐఎస్ఎఫ్ అశేష పోరాటాలు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మలిదశ తెలంగాణ ఉద్యమం, 18 ఏళ్లకే ఓటు హక్కు సాధన వంటి అనేక విజయాల్లో ఎఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం అసమానతలతో నిండి వున్నందున, ప్రభుత్వ విద్య పరిరక్షణకై విద్యార్థులు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ నాయకులు రాజు కుమార్, బోడ గణేష్, కొర్ర శివ, ఆంగోత్ శ్రీనివాస్, వంకుదొతు శ్రీవిదేవ్, బానోతు గణేష్, బానోతు రిషిత్, లావుడ్య లోకేశ్వర్, గుగులోత్ వరుణ్, విద్యార్థులు పాల్గొన్నారు.