Rahul Gandhi  | అంబటిపల్లి మహిళా సదస్సులో  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ.

Written by telangana jyothi

Published on:

Rahul Gandhi  | అంబటిపల్లి మహిళా సదస్సులో  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ.

మహాదేవపూర్ ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ మహదేవ్‌పూర్ మండలం అంబట్‌పల్లిలో ఏర్పాటు చేసిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నారు. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ సంపద దోపిడీకి గురవుతోందని ఆరోపించారు.కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఏటీఎంలా మారిందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.500కు వంట గ్యాస్ సిలిండర్‌ ఇస్తామని.. కేసీఆర్ దోచుకున్న సొమ్మును మహిళల ఖాతాల్లో వేస్తామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని.. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.2,500 ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ మూడు ఒక్కటేనని ఆక్షేపించారు. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాహుల్ గాంధీ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Tj news

1 thought on “Rahul Gandhi  | అంబటిపల్లి మహిళా సదస్సులో  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ.”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now