అడ్వంట సీడ్స్ కంపెనీ వారి మిర్చి పంట క్షేత్ర ప్రదర్శన
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండల కేంద్రంలోని బ్రాహ్మణపల్లి గ్రామం లో రైతు తడుకల రాములు మిరప తోటలో గురువారం అడ్వాంట సీడ్స్ గోల్డెన్ వండర్ రకం మిర్చి పంట పైన క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. సుమారు 200 మంది రైతులు తిలకించారు. ప్రస్తుత వాతావరణాన్ని చీడ పీడలు తట్టుకొని, పంట ఏపుగా పెరిగి మంచి కాపు వచ్చిందని పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కంపెనీ మేనేజర్ మనోజ్ చౌదరి మాట్లాడుతూ రైతులు నాణ్యమైన నమ్మకమైన గోల్డెన్, వండర్ విత్తనాలు ఎంచుకోవాలని, అదిక దిగుబడి పొందడానికి సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్య క్రమంలో కంపెనీ నేషనల్ మేనేజర్ అమూల్ శర్మ. జోనల్ మేనేజర్ వసంతన్, క్రాప్ మేనేజర్ విక్రమ్, డిస్ట్రిబ్యూటర్లు కటకం అశోక్, కడార్ల శంకర్, డీలర్లు సంపత్, రాజ్ కుమార్, రాజబాబు, శేఖర్, క్రాంతి కుమార్, రాకేష్, మనోజ్, కంపనీ ప్రతినిది తోట సమ్మయ్య, పలువురు రైతులు పాల్గొన్నారు.