చలో భద్రాచలం ధర్మయుద్ధానికి భారీగా వెళ్లిన ఆదివాసీలు
వెంకటాపురం, సెప్టెంబర్29, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల నుండి ఆదివారం భద్రాచలం ధర్మయుద్ధ బహిరంగ సభకు వందలాది ఆదివాసీలు భారీగా తరలివెళ్లారు. ఆదివాసి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, గ్రామాల వారీగా వాహనాలను సమకూర్చుకొని ఆదివాసీలు భద్రాచలంకు చేరుకున్నారు. ముందుగా వెంకటాపురం మండల కేంద్రంలోని కొమరం భీం విగ్రహం వద్ద సమావేశమైన ఆదివాసీలు, అనంతరం వాహన శ్రేణులన్నీ కలసి నినాదాలతో తిరిగారు. జై జై ఆదివాసీ… జై ఆదివాసీ”, “లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి, “హలో ఆదివాసీ… చలో భద్రాచలం” అంటూ నినాదాలు గుప్పిస్తూ పెద్ద సంఖ్యలో సభకు బయలుదేరారు.