విద్యార్థులతో పనులు చేయిస్తున్న హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి
– ఎన్ హెచ్ ఆర్ సి ప్రధాన కార్యదర్శి మధుకర్.
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : కన్నాయిగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయిస్తు న్న ఉపాధ్యాయులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కన్నా యిగూడెం మండల జాతీయ మానవ హక్కుల కమిటీ ప్రధాన కార్యదర్శి వాసంపెళ్లి మధుకర్ అన్నారు. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ… కన్నాయిగూడెం మండలంలోని గిరిజన బాయ్స్ హాస్టల్లో ఉపాధ్యాయులు చిన్న పిల్లలతో పనులను చేపించడం సరికా దని, ఇలా పనులు చేపించడం ఇది రెండో సారని దీంతో ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలతో చేయించాల్సిన పనులను విద్యార్థులతో చేయించడం సరి కాదని ప్రశ్నించారు. చేతులో పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థుల చేతికి గొడ్డలను ఇచ్చి చెట్ల కొమ్మలను తొలిగించడం పట్ల హాస్టల్ యాజమాన్యంపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.