ఘనంగా ఏబీవీపీ 77 వ ఆవిర్భావ దినోత్సవం
మహాదేవపూర్,జులై9, తెలంగాణ జ్యోతి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాదేవపూర్ శాఖ ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి నినాదాలు చేశారు. నగర కార్యదర్శి పేట సాయి మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భారతదేశంలో జాతీయ భావజాలం కలిగిన అతి పెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపి 1948లో స్థాపించబడిందని వివరించారు. అధికారికం గా దీనిని 1949, జూలై 9న నమోదు చేశారు. ప్రపంచములో అతి పెద్ద విద్యార్ది సంస్థగా ఎబివిపి అవతరించిందన్నారు. అదే విధంగా దేశ భక్తి విజ్ఞానం సేవా భావం కలిగి ఉన్న సంస్థ ఏబీవీపీ అవతరించిందనీ పేర్కొన్నారు. నేటికి కోట్లాది మంది విద్యార్థుల ను చైతన్య వంతులుగా తీర్చిదిద్దిన శక్తి వంతమైన విద్యార్ది శక్తిగా ఏబీవీపీ అవతరించిందనీ గుర్తు చేశారు. ప్రతి సమస్యను తనదిగా భావించి పరిష్కారానికి పోరాడే సంస్థే ఎబివిపి, అదే విధంగా తెలంగాణ ఉద్యమములో కూడా ఎబివిపి కీలకమైన పాత్ర పోషించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి కృషి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమoలో విద్యార్థులు, ప్రస్తుత కార్యకర్తలు, పూర్వ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.