మరికల్ పట్టణలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక
నారాయణపేట, ఆగస్టు3, తెలంగాణ జ్యోతి:నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని మణికంఠ జూనియర్ కాలేజీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పట్టణ కమిటీ ఎన్నికలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా యజ్ఞ భరత్‌ను పట్టణ కార్యదర్శిగా, వికాస్, మంజునాథ్‌లను సంయుక్త కార్యదర్శులుగా ఎన్నుకున్నారు. అలాగే సోషల్ మీడియా ఇన్చార్జిగా ఆదిత్య, రాకేష్, సురీటీ బన్నీ, చిన్న రాయుడు తదితరులను నియమించారు. ఈ సందర్భంగా సురీటీ బన్నీ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల తర్వాత మరికల్ మండల కేంద్రంలో పట్టణ కమిటీ ఏర్పాటు కావడం ఎంతో ఆనందదాయకమన్నారు. విద్యార్థుల ఉన్నత చదువులు, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల తో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు ఏబీవీపీ ఒక బలమైన వేదిక అవుతుందని చెప్పారు. పలువురు సభ్యులు ఈ కమిటీకి అభినందనలు తెలిపారు.