ప్రపంచ వేదికపై మెరిసిన ఆదివాసి ఆణిముత్యం 

ప్రపంచ వేదికపై మెరిసిన ఆదివాసి ఆణిముత్యం 

ప్రపంచ వేదికపై మెరిసిన ఆదివాసి ఆణిముత్యం 

వెంకటాపురం, ఆగస్టు28, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసి యువకుడు మోడెం వంశీ ప్రపంచ స్థాయి క్రీడా రంగంలో గొప్ప విజయం సాధించాడు. యూఎస్‌లో జరిగిన ప్రపంచ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో 68 కిలోల విభాగంలో ప్రథమ స్థానం సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన వంశీ, తన కృషి, ప్రతిభతో అంతర్జాతీయ వేదికపై మెరిసి, తెలంగాణకు, ములుగు జిల్లాకే వన్నె తెచ్చాడు. భారత్ తరపున పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించడంతో అధికారులు, ఆదివాసి సంఘాల నాయకులు, ప్రజానీకం అతడిని అభినందించారు. భారత్‌కు తిరిగి రాగానే మోడెం వంశీకి ఘన సత్కారాలు, సన్మానాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment