చెప్పులు లైన్లో పెట్టి ఎరువుల కోసం ఎదురుచూసే పరిస్థితి

చెప్పులు లైన్లో పెట్టి ఎరువుల కోసం ఎదురుచూసే పరిస్థితి

చెప్పులు లైన్లో పెట్టి ఎరువుల కోసం ఎదురుచూసే పరిస్థితి

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించాలి

భూపాలపల్లి జిల్లాలో ఏం జరుగుతుంది

భూపాలపల్లి, జూలై 22, తెలంగాణ జ్యోతి : చెప్పులు లైన్లో పెట్టి ఎరువుల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొందని, జిల్లాలకు మంత్రులు వస్తున్నారు.. పోతున్నారు… కానీ ప్రజలకు ప్రయోజనం ఉండటం లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా సాగు జరిగే జిల్లా భూపాలపల్లిలో ఎరువుల కొరత తక్షణమే తీర్చాలని మంత్రి శ్రీధర్‌బాబును ఆయన కోరారు. కాళేశ్వరం మోటార్లు నిలిపివేయడంతో వేల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, వెంటనే మళ్లీ మోటార్లు ఆన్ చేసి నీటి విడుదల జరగాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పేదలకు డ్రా విధానంలో పారదర్శకంగా ఇళ్లను కేటాయించిన తమ బీఆర్‌ఎస్ హయాంలో పోల్చితే, కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారుల జాబితాలు మార్చి దళారీ వ్యవస్థకు అంకితమైందని ఆరోపించారు. గతంలో జర్నలిస్టులకు మంజూ రైన ఇళ్ల పట్టాలను వెంటనే అందించి, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. జూలై 27న భూపాలపల్లిలో జరిగే బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సందర్భంగా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటలో కీ.శే కొడారి కోమురయ్య విగ్రహ ఆవిష్కరణ, పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నం దున, కార్యకర్తలంతా భారీగా పాల్గొనాలని గండ్ర పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment