ఏజెన్సీ గర్వించదగ్గ విద్యా కుసుమం
– సీ.ఏ.లో బచ్చు రాహుల్ గౌతమ్ సత్తా
వెంకటాపురం, జులై 6,తెలంగాణ జ్యోతి : మండల కేంద్రానికి చెందిన బచ్చు రాహుల్ గౌతమ్ చార్టెడ్ అకౌంటెన్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఏజెన్సీ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు. మెడికల్ షాప్ వ్యాపారం చేస్తున్న తండ్రి బచ్చు పూర్ణచంద్రరావు రాహుల్‌కు విద్యాబోధనలో మార్గదర్శకుడయ్యారు. వెంకటాపు రంలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన గౌతమ్, ఖమ్మం, హైదరాబాద్‌లలో ఉన్నత విద్య కొనసాగించి, లక్ష్య సీఏ ఇనిస్టిట్యూట్‌లో 5 సంవత్సరాల కృషితో చార్టెడ్ అకౌంటెంట్‌గా అర్హత సాధించారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి సీఏ పూర్తిచేసిన అరుదైన విద్యార్థిగా పలువురు గౌతమ్‌ను, ఆయన తల్లిదండ్రుల ను హర్షధ్వానాలతో అభినందించారు.